కర్నూలు వ్యవసాయ మార్కెట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు క్వింటా ఉల్లి గరిష్టంగా 13 వేల వరకూ పలికాయి. ఈరోజు ధర 9 వేల దిగువకు చేరుకుంది. ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవటం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి ఎగుమతిని అధికారులు అడ్డుకోవడం వల్ల ధర తగ్గిందని రైతులు అంటున్నారు. కొందరు రైతులు అధిక ధర కోసం ఉల్లిని హైదరాబాద్కు తరలిస్తున్నారని, అటువంటి ఎగుమతులను అనుమతించమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తరఫున రైతుబజార్లలో ఉల్లి కొనుగోలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర సరిహద్దుల్లో ఉల్లి లారీలపై దాడులు చేసినందుకు.. వ్యాపారుల నుంచి కొనుగోలు తగ్గిందని అందువలన ఉల్లి ధరలు తగ్గాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :