Onion Farmers Protest:నకిలీ ఉల్లి విత్తనాలతో నష్టపోయామని.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విత్తనాల దుకాణం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోయామని కలత చెందిన సుధాకర్ అనే రైతు.. రుమాలు మెడకు బిగించుకొని ఆత్మహత్యకు యత్నించగా.. తోటి రైతులు అడ్డుకున్నారు.
నష్టపోయిన రైతులంతా.. కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ మండలం బేతాల గ్రామానికి చెందిన వారు. నకిలీ విత్తనాలు విక్రయించి మోసంచేసిన దుకాణదారుడిపై చర్యలు తీసుకుని.. న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.