Onion Farmers Fire on YSRCP Government: ప్రతిపక్ష నేత హోదాలో అధికారంలోకి వస్తే ఉల్లి రైతులను ఆదుకుంటామని హామీల మీద హామీలిచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. ఉల్లి రైతులకు అండగా నిలిచే ఆలోచనే చేయడం లేదు. వర్షాలతో దిగుబడులు తగ్గి, మద్దతు ధర దక్కక.. రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్‌కు రైతుల గోడు ఎంతమాత్రం పట్టడం లేదు. ఏటేటా నష్టాలు పెరిగి.. రాష్ట్రంలో ఉల్లి సాగు తగ్గిపోయి వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లి తెప్పించుకుంటున్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ తీవ్రతను గుర్తించటంలేదు.
ఉల్లి రైతుకు వెన్నుపోటు.. నష్టాలు భరించలేక రైతన్న అవస్థలు CM Jagan Comments: 2019 మార్చి 25వ తేదీన కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తూ..''ఉల్లికి రేటు రాక, రైతులు పొలాల్లోనే పంటను వదిలేస్తున్న పరిస్థితిని చూస్తున్నా.. నా పాదయాత్రలో అతి దగ్గర నుంచి మీరు పడుతున్న కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. కాబట్టి నేను విన్నాను-నేను ఉన్నాను' అని హామీ ఇచిన్న జగన్.. ఉల్లి సాగు చేసే రైతున్నలకు కన్నీళ్లే మిగిలేలా చేశారు.
Prathidwani: చెప్పేదొకటి.. చేసేదొకటి.. జగన్ తీరుతో నాలుగేళ్లుగా మోసపోతున్న రైతులు
YCP Govt Did not Increase the Prices of Onion: ‘ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాం.. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం..’ అంటూ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ మాటలు చెప్పడం తప్పితే.. ఉల్లి రైతుల్ని ఆదుకునేందుకు కనీస చర్యలు కొరవడ్డాయి. 2019-20లో క్వింటాల్‌కు 770 రూపాయల మద్దతు ధర ప్రకటించినా.. నామమాత్రంగానే అమలు చేస్తున్నారు. పెట్టుబడి ఏటికేడు పెరుగుతున్నా.. నాలుగేళ్లుగా మద్దతు ధర పైసా కూడా పెంచలేదు. అయినా, రైతు బిడ్డనంటూ రోజూ బీరాలు పోతున్నారు. దీంతో రైతులకు ఏటికేడు కష్టాలే మిగులుతున్నాయి.
Farmers Suffering Due to Lack of Irrigation Water: వరిపైరుకు అందని సాగునీరు.. అల్లాడుతున్న రైతులు
Jagan Sarkar Did not Give Reassurance to Onion Farmers:ప్రస్తుతం మార్కెట్ ధరలు బాగున్నా.. రైతుల దగ్గర పంట లేదు. రైతుల దగ్గర పంట ఉన్నప్పుడు ధరలు క్వింటాల్‌కు 400 నుంచి 600 రూపాయల మధ్యనే ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మార్కెట్‌కు తెచ్చినా ధరలు రాక పారబోసి.. బస్సు ఛార్జీలకూ అప్పు తీసుకుని ఇళ్లకు వెళ్తున్నారు. ఒక్కోసారి క్వింటాల్‌కు 100 రూపాయలు కూడా లభించక పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినా ఉల్లి రైతుకు భరోసా కల్పిద్దామనే ఆలోచన.. ప్రభుత్వంలో కొరవడింది.
Declining Onion Cultivation:రాష్ట్రంలో సగటున ఏటా లక్షా 12 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తారు. సుమారు 9 లక్షల 80 వేల టన్నుల ఉత్పత్తి లభిస్తుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉల్లి సాగు అధికం. వైఎస్సార్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 79వేల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉండగా 31 వేలు మాత్రమే సాగైంది. ఉల్లి సాగుకు ఎకరాకు రూ.40వేల పైనే ఖర్చవుతోంది. నాలుగేళ్లుగా పెట్టుబడులు కూడా రావడం లేదు.
Onion Yield Decreased During Kharif Season: ఎకరాకు సగటున 30వేల రూపాయల వరకు నష్టపోతున్నామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొంతమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. అధిక వర్షాలు, వర్షాభావం, తెగుళ్లతో గతేడాది ఖరీఫ్‌లోనూ దిగుబడులు తగ్గాయి. గతేడాది ఆగస్టులో 4 వేల 290 టన్నుల ఉత్పత్తి కర్నూలు మార్కెట్‌కురాగా.. ఈ ఏడాది ఆగస్టులో 379 టన్నులు మాత్రమే రావడం ఉత్పత్తిలో క్షీణతకు అద్దం పడుతోంది.
Encouragement to Onion Farmers Under TDP Regime: గత ప్రభుత్వ హయాంలో ఉల్లి రైతుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. ఉల్లి నిల్వ సౌకర్యాలకు రాయితీపై నిధులు ఇచ్చింది. 2018-19లో ఉల్లి రైతులకు ధరల మద్దతు పథకం కింద కిలోకు 6 రూపాయల చొప్పున అదనపు ధర కల్పించడం ద్వారా మొత్తం 6 కోట్ల 45 లక్షల రూపాయలు అందించింది. 2014-15 నుంచి 2018-19 వరకు రైతుల నుంచి 3 లక్షల 10 వేల టన్నుల ఉల్లిని సేకరించింది. క్వింటాల్ ఉల్లిని 800 రూపాయల చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసి.. రైతు బజార్ల ద్వారా కిలో 10 నుంచి 11 రూపాయల చొప్పున అమ్మకం చేయించారు.
Onion Support Price Reduced During YSRCP Regime: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక క్వింటాల్‌కు 770 రూపాయల చొప్పున మద్దతు ధరగా నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర కంటే తక్కువే. అదీ సరిగా సేకరించిన సందర్భమే లేదు. రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో వేచి చూడాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో ధరల స్థిరీకరణ నిధి కింద కేవలం 3 వేల 193 టన్నుల ఉల్లిని సేకరించారు.
Farmers Demand to Fix Rs.1000 per Quintal Onion: గతంలో ఉల్లి రైతులకు విత్తనాలను రాయితీపై ఇవ్వగా.. నాలుగేళ్లుగా నామమాత్రంగా కొందరికి ఇచ్చి మమ అనిపిస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు రైతులకు ఉచితంగా, రాయితీపై మేలు రకం విత్తనాలు పంపిణీ చేస్తున్నాయి. గిట్టుబాటు ధరలు రాని సమయంలో మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టిన సమయంలో రైతులు గోదాముల్లో నిల్వ ఉంచుకుని ధరలు పెరిగిన సమయంలో విక్రయించుకునే సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రకమైన ప్రోత్సాహం లేదు. కర్నూలు జిల్లాలో సాగయ్యే ఉల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. వారం కూడా నిల్వ ఉండకపోవడంతో.. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందించడంతోపాటు.. మద్దతు ధరను క్వింటాల్‌కు వెయ్యి రూపాయలకు పైన నిర్ణయించి కొనుగోలు చేస్తేనే రైతుకు ఊరట లభిస్తుంది.
NO Relief Actions on Drought Situation In AP జగనన్న.. రైతన్న గోడు వినిపించడం లేదా! వర్షాభావ పరిస్థితులపై మొద్దు నిద్ర వీడేది ఎప్పుడు..?