ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిలిస్తే కష్టాలే.. ప్రమాదం మిగిల్చిన గుర్తులతో కన్నీళ్లే!

పాపికొండల్లో బోటు మునిగిన సంఘటనకు సరిగ్గా ఏడాది. ప్రమాదంలో మునిగి పోయి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కాలం కరిగిపోతున్నా.. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నవారి కన్నీరు మాత్రం ఇంకిపోలేదు. బోటు ప్రమాదంలో జలసమాధి అయిన 51మంది కుంటుంబాలను కదిలిస్తే కన్నీళ్లే... అన్నట్టుగా బాధితులు ఆవేదనకు గురవుతున్నారు.

one year of Kuchchuluru boat accident
బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబం

By

Published : Sep 16, 2020, 3:17 PM IST

2019 సెప్టెంబరు 15.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటుపై ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి బోటు నీటిలో తిరగబడింది. ఈ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి దంపతులు, వారి ఇద్దరు పిల్లలు జలసమాధి అయ్యారు.

బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబం

వీరిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా, విఖ్యాతరెడ్డి మృతదేహం మాత్రం ఇప్పటికీ దొరకలేదు. వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. కుమారుడు, కోడలు, మనవళ్ల చిత్రాలు చూస్తూ కన్నీటి పర్యంతమవుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details