MURDER: కర్నూలు జిల్లా నంద్యాల నడిగడ్డ ప్రాంతంలో గఫార్(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గఫార్ ఇంటివద్ద ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో.. గఫార్ అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గఫార్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.