వివాహానికి వెళ్లివస్తుండగా ప్రమాదం... కొనిదేడులో వ్యక్తి మృతి - పాణ్యం మండలంలో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనం-ట్రాక్టర్ ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొనిదేడు గ్రామ సమీపంలో జరిగింది.

కొనిదేడులో బైక్-ట్రాక్టర్ ఢీ:ఒకరు మృతి
కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొనిదేడు గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. కొనిదేడు వాసి బాషా ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా...బనగానపల్లె రహదారిలో మృత్యువు కాటేసింది. ఆయన వచ్చే ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాషా అక్కడిక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాషాకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి:
నియమాలు పాటించకుండా.. నామినేషన్ల బలప్రదర్శన
Last Updated : Nov 20, 2020, 12:52 PM IST