కూతురు ప్రసవించిందని తెలిసిన తండ్రి... కర్నూలుకు చేరుకుని బిడ్డను, చిన్నారిని చూశాడు. ఆ ఆనందంతో ఇంటికి తిరుగుపయనమయ్యాడు. ఆ లోపే మృత్యువు కారు రూపంలో కబళించింది. ఈ విషాదకరమైన ఘటన కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూర్ వద్ద జరిగింది. నందికొట్కూరు మండలం బిజినేముల గ్రామానికి చెందిన కృష్ణయ్య గౌడ్ ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. కృష్ణయ్య గౌడ్ కుమార్తె.. కర్నూలులోని ఓ ఆసుపత్రిలో ప్రసవించింది. విషయం తెలుసుకున్న ఆయన కూతురుని, చిన్నారిని చూసి ఆనందంతో బైక్పై తిరుగుపయనమయ్యాడు. కర్నూలు నుంచి బయలుదేరిన కృష్ణయ్య.. బ్రాహ్మణకొట్కూరు వద్దకు రాగానే తన ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన గాయపడ్డాడు. వెంటేనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై మృతుడు కృష్ణయ్య కుమారుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదుచేసుకున్న వారు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొన్న కారు... ఒకరు మృతి - BIKE ACCIDENT NEWS IN KURNOOL
కుమార్తె ప్రసవించిదన్న ఆనందంలో కర్నూలుకు చేరుకున్న తండ్రిని.. తిరుగుపయనంలో కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన బ్రాహ్మణకొట్కుర్ వద్ద జరిగింది. ఈ ఘటనలో కృష్ణయ్య గౌడ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బైక్ను ఢీకొన్న కారు... ఒకరు మృతి