కర్నూలు జిల్లా నంద్యాల ఎస్బీఐ కాలనీలో మధుసూదన్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు పెట్టే.. రైటర్ సేఫ్ గార్డ్‌లోని సీఆర్ఏగా మధుసూదన్ పని చేస్తున్నాడు. ఏటీఎంలో పెట్టిన నగదులో తేడా రావటంతో.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు.. మధుసూదన్‌ను పిలిచినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధుసూదన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న గదిలో.. మధుసూదన్ రాసినట్లు అనుమానిస్తున్న సూసైడ్ నోటు దొరికింది. అందులో.. " గౌరవనీయులైన బీఎం గారికి నా చావుకి కారణం నిషాంత్. నేను దొంగతనం చేయలేదు. నాకు దానికి సంబంధం లేదు. అవమానం తట్టుకోలే చనిపోవాలని అనుకుంటున్నా. అందుకు దయచేసి నా పేరును బయటపడకుండా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మధుసూదన్" అని ఉంది.