కర్నూలు జిల్లా మాధవరం మండలం రాచమర్రి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ఆటోలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు - kurnool district crime
కర్నూలు జిల్లా రాచమర్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
![రెండు ఆటోలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు one man died in a road accident at rachamarri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11429364-894-11429364-1618592724489.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి