ఉరుములు, మెరుపుల బీభత్సంతో ఆందోళన చెంది ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగింది. పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వేపచెట్టు కారుపై పడడంతో పాక్షికంగా ధ్వంసమైంది. సుమారు గంటపాటు పట్టణంలో వర్షం కురిసింది. మృతుని పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బనగానపల్లెలో ఉరుముల శబ్దాలతో ఆగిన గుండె - banaganapalle news today
కర్నూలు జిల్లా బనగానపల్లెలో భారీ వర్షం కురిసింది. పట్టణంలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో ఆందోళన చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.

బనగానపల్లెలో మృతి చెందిన వ్యక్తి