కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కొండజాటూరు గ్రామానికి చెందిన ప్రభుదాసు (40) కర్నూలులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొండజూటూరు నుంచి ద్విచక్రవాహనంపై కర్నూలుకి వెళుతుండగా తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వెనకనుంచి ట్యాంకర్ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభుదాసు తలపై లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పాణ్యం ఎస్సై రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతునికి భార్య ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
తమ్మరాజుపల్లె వద్ద ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి - kurnool latest news
పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
One man dead road accident at tammarajupalle