కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడపురం గ్రామంలో 2 రోజుల క్రితం ఓ దుకాణం ముందు ప్రమాదవశాత్తు పెట్రోలు అంటుకొని మంటలు రావడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. 6ఏళ్ల తనుశ్రీ మరణించింది. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. తనుశ్రీ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చికిత్స పొందుతున్న మిగిలిన ఇద్దరిలో ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పెట్రోలు మంటలంటుకొని చిన్నారి మృతి.. - peddagummadipiram
మంటలంటుకున్న పెట్రోలు బాటిళ్లు మీదా పడటంతో తీవ్రగాయాలైన ముగ్గురు చిన్నారుల్లో ఒక పాప మృతి చెందింది. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
one girl died by petrol inccident at peddagummadipiram in karnool district