కర్నూలు జిల్లా నంద్యాలలో బొగ్గు లైను ప్రాంతంలో నిర్మితమవుతున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెప్టిక్ ట్యాంకుకు రంగు వేస్తున్న ఇద్దరు కూలీలు అస్వస్థతకు గురై అక్కడే పడి పోయారు. ఇది గమనించిన నీటి సరఫరా నిర్వాహకుడు ప్రతాప్, సెక్యూరిటీ గార్డు కేశాలు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా రక్షించారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వీరిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రతాప్ మృతి చెందాడు.
రెండు ప్రాణాలు కాపాడి.. తాను మృత్యుఒడికి చేరుకున్నాడు - one died in nanyala due to helping the persons who are in stucked in septic tank
ప్రమాదంలో ఉన్న వారిని కాపాడదామని వెళ్లాడు. రెండు నిండు ప్రాణాలు కాపాడి చివరకు గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఘటన వివరాలివి..!
ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడబోయు తానే చనిపోయాడు