కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు చెక్ పోస్టు వద్ద ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొనటంతో ఆరుగురికి గాయలుకాగా.. ఒకరు మరణించారు. గిలేసూగూరు నుంచి కొందరు ప్రయాణికులు ఆటోలో మాధవరానికి వెళ్తుండగా ,మంత్రాలయం నుంచి అయిజకి వెళుతున్న కారు.. ఢీ కొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న రామాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మరణించారు. ఆటో డ్రైవర్ లోకేష్ సహా మరో ఐదుగురు గాయపడ్డారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని స్థానిక ఎస్సై బాబు తెలిపారు.
Accident: కారు - ఆటో ఢీ.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు - కర్నూలు జిల్లా మాధవరం సరిహద్దు వద్ద రోడ్డు ప్రమాదం వార్తలు
కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు చెక్ పోస్టు వద్ద.. కారు - ఆటో ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
కారు-ఆటో ఢీ.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు