ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Srisailam: శ్రీశైలంలో అద్భుతం..మరోసారి బయటపడ్డ తామ్ర శాసనాలు - శ్రీశైలంలో ప్రాచీన తామ్ర శాసనాలు

శ్రీశైలంలోని ఘంట మఠం వద్ద ప్రాచీన తామ్ర శాసనాలు వెలుగుచూశాయి. ఘంట మఠం ఉప ఆలయాల పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 21 తామ్ర శాసనాలు బయటపడ్డాయి.

olden metal inscriptions were found at srisailam
ఘంట మఠం వద్ద వెలుగుచూసిన ప్రాచీన తామ్ర శాసనాలు

By

Published : Jun 13, 2021, 4:19 PM IST

Updated : Jun 14, 2021, 2:06 AM IST

శ్రీశైల క్షేత్రంలో ఆదివారం తామ్రశాసనాలు బయటపడ్డాయి. ఘంటామఠం ప్రాంగణంలోని ఉపఆలయాల జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా..మట్టిని తొలగిస్తుండగా 21 తామ్రశాసనాలు లభ్యమయ్యాయి. దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్, సీఐ బి.వెంకటరమణ వాటిని పరిశీలించారు.

శాసనాల్లో తెలుగు, నందినాగరి లిపి ఉన్నట్లు గుర్తించారు. ఈఈ బాలమురళీకృష్ణ, డీఈ నరసింహారెడ్డి, స్థపతి జవహర్, ఏఈ సురేష్ పంచనామా చేసి శాసనాలను నమోదు చేసుకున్నారు. మైసూరు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంచాలకుడు మునిరత్నంరెడ్డికి వీడియో ద్వారా చూపించారు.ఈ సందర్భంగా మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ..శాసనాల్లోని లిపిని బట్టి అది14-16 శతాబ్ద కాలం నాటిదని భావిస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Jun 14, 2021, 2:06 AM IST

ABOUT THE AUTHOR

...view details