కర్నూలు జిల్లా వెల్తుర్తి మండలం కొసనపల్లిలో ఘోరం జరిగింది. కంట్లో పడిన నలక ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తల్లి కుమారుడు రాములమ్మ, మధు ద్విచక్రవాహనంపై చిన్న టేకూరు బయల్దేరారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న మధు కంట్లో నలక పడటంతో అతను బండిపై అదుపు కోల్పోయాడు. దీంతో ద్విచక్రవాహనం ఓ వంతెనను ఢీ కొట్టింది. ఉహించని పరిణామంతో బైక్ వెనుక కూర్చున్న రాములమ్మ ఎగిరి వంతెన కిందకు పడిపోయింది. రాములమ్మ తలకు బలమైన గాయాలు కావటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మధుకు తీవ్ర గాయాలు కావటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కంట్లో నలక.. ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది !
మరణం ఏ వైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలు ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. అచ్చం అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కంట్లో పడిన నలక ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది.
తీసింది ఓ వృద్ధురాలి ప్రాణం