కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జవహర్ నవోదయ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని.. కార్యక్రమాన్ని హుషారుగా నిర్వహించారు. కరోనా కారణంగా కొంతమంది రాకున్న వర్చ్యువల్ మీటింగ్లో పాల్గొన్నారు. పాఠశాలలో చదువుకున్న చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - ఉత్సహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం న్యూస్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జవహర్ నవోదయ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆనాటి మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ..పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.

ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు జేఎన్వీ కర్నూలు వెల్ఫేర్ టీం పేరుతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ద్వారా ఆర్థిక స్థోమత లేని విద్యార్థులను చదివించటంతో పాటు.., పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతానికి పిల్లల కోసం వాటర్ ప్లాంట్, పిల్లలను కలవడానికి వచ్చే తల్లితండ్రుల కోసం భవనం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.