ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా పిల్లలే పింఛను లాక్కుని దాడి చేస్తున్నారు' - కర్నూలులో వయోవృద్ధుల సమస్యలు

వయోవృద్ధుల సమస్యలు అన్నీ ఇన్నీకావు. తిండిలేక అవస్థలు పడుతున్న వారు కొందరైతే.. ఒంటరి జీవితం గడుపుతున్న వారు మరికొందరు. నా అనుకున్న వారే వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న దుస్థితి మరొకరిది. వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వృద్ధులు.. అధికారులను వేడుకుంటున్నారు.

old men
old men

By

Published : Jun 15, 2020, 3:41 PM IST

Updated : Jun 15, 2020, 10:54 PM IST

రాష్ట్రంలో వయోవృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. కర్నూలు జిల్లాలో వయోవృద్ధులు కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. నేడు వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా.. తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇస్తున్న కాస్త పింఛనూ.. పిల్లలు తీసుకుని తమపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

నా పిల్లలను ఎంతో కష్టపడి చదివించాను. ఉద్యోగం వచ్చేదాకా నాన్నా..నాన్నా..అని నావెంటే ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం , పెళ్లి, పిల్లలు వచ్చేసరికి నా పాటికి నన్ను వదిలేశారు. నాకు ప్రభుత్వం ఇచ్చే కాస్త పింఛను కూడా నాకు దక్కనివ్వడం లేదు. - ఓవృద్ధుడి ఆవేదన

ఇదీ చదవండి:పాక్​లో భారత 'హైకమిషన్​' అధికారులు అదృశ్యం

Last Updated : Jun 15, 2020, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details