కర్నూలు జిల్లా తుగ్గల్లి మండలం రాంపురంకొట్టాల సమీపంలో వృద్ధుడి హత్యకు గురైయ్యాడు. నిన్న రాత్రి మద్యం తాగేందుకు పక్కనే ఉన్న మరో గ్రామానికి వెళ్లిన కాశీం(65) ఇంటికి రాలేదు. ఉదయాన్నే గ్రామ సమీపంలో మృతదేహం కనిపించటంతో.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం ఎవరో హత్య చేసి ఉంటారని.. భావిస్తున్నారు.
వృద్ధుడని చూడకుండా డబ్బు కోసం అత్యంత కిరాతకంగా చంపేశాడు - కర్నూలు జిల్లా న్యూస్ అప్డేట్స్
మానవత్వం మంటగలుస్తుంది. ఓ వృద్ధుడిని అత్యంత కిరాతకంగా బండరాయితో కొట్టి చంపేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. డబ్బు కోసమే చంపిఉంటారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.
old man murder