కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండ్లో పై పెచ్చులుడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లా పెద్దముడియం మండలం కొండ సుంకేసులకు చెందిన రాజు (60) బస్టాండ్లో కూర్చుని ఉండగా పై నుంచి పెచ్చులూడి పడ్డాయి. గాయాలు కావటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సదరు వ్యక్తి గత కొంత కాలంగా పలు దుకాణాల్లో పనిచేస్తూ ఇక్కడే జీవనం సాగించేవాడని పోలీసులు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బస్టాండ్ భవనం పై పెచ్చులూడి వ్యక్తి మృతి - Kurnool District Kovelakuntla Latest News
బస్టాండ్ భవనం పై పెచ్చులూడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన.... కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండ్ జరిగింది. కడప జిల్లా పెద్దముడియం మండలం కొండసుంకేసులకు చెందిన రాజు బస్టాండ్ లో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా పై పెచ్చులూడాయి.

బస్టాండ్లో పై పెచ్చులూడి పడి వృద్ధుడి మృతి
ఇవీ చదవండి
జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య
Last Updated : Dec 5, 2020, 1:16 AM IST