కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ మియా... కలెక్టరేట్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. షేక్ మహమ్మద్‌ను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు... బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.