కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని జాతీయ రహదారిపై ఎయిర్ పోర్ట్ ఎంట్రెన్స్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌కు అకస్మాత్తుగా నిప్పంటుకుంది. గుజరాత్ నుంచి చెన్నైకి ఆస్ట్రో కెమికల్ లోడుతో వెళుతున్న ట్యాంకర్ దగ్ధం అవుతుండగా...విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సుధాకర్ ఫైర్ ఇంజన్‌కు ఫోన్ చేశారు. సిబ్బందితో అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. రహదారిపై ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా... మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపివేశారు.
జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ దగ్ధం - kurnool
కర్నూలు జిల్లా జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేశారు.

కర్నూలు జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధం