..
ఓర్వకల్లు విమానాశ్రయంలో త్వరలో రాకపోకలు - కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం
కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని విమానాశ్రయాన్ని అధికారులు పరిశీలించారు. రెండు నెలల్లో విమానాల రాకపోకలకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలయన్ పేర్కొన్నారు. 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను పూర్తి చేసి త్వరలో విమానాల రాకపోకలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈయనతోపాటు ప్రభుత్వ విమానయాన సలహాదారు భరత్ రెడ్డి , ఏపీ ఏడీసీఎల్ సీఈవో నీనా శర్మ , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు విమానాశ్రయంలో వసతులను పరిశీలించారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని విమానాశ్రయాన్ని పరిశీలిస్తున్న అధికారులు