ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాజిటివ్ అయితే ఏంటి?.. మావాడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటాడు' - carpna positive in kurnool

కరోనా సోకిన వ్యక్తిని తీసుకువెళ్లటానికి వచ్చిన అధికారులను.. అతని కుటుంబీకులు, స్థానికులు అడ్డుకున్నారు. ఇంట్లోనే ఉంచి చికిత్స చేయించుకుంటాడని చెబుతూ.. కుటుంబ సభ్యులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో అడ్డుపడ్డారు.

kurnool district
పాజిటివ్ వస్తే ఏంటి.. మావాడిని ఇంట్లోనే ఉంచండి

By

Published : Jun 29, 2020, 7:07 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా సోకిన ఓ వ్యక్తి ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆదోని పట్టణం ఫారీషమళ్ల ప్రాంతంలో.. ఓ వ్యక్తికి కరోనా రాగా.. చికిత్స కోసం తరలించటానికి వైద్య సిబ్బంది అతని ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కరోనా బాధితుడి కుటుంబీకులు, స్థానికులు.. వారికి అడ్డుపడ్డారు. అతడు ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకుంటాడని పట్టుబట్టారు.

చివరికి పోలీసులు వచ్చి చెప్పినా వారు వినలేదు. 3 గంటలపాటు.. శ్రమించిన వైద్య సిబ్బంది, పోలీసులు.. వారందరికీ నచ్చజెప్పారు. అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించలని కోరారు. ఇలా అడ్డుకోవడం వల్ల పట్టణం అంతా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details