గ్రామ, వార్డు వాలంటీర్ల పనితీరుపై కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్... వీడియో కాన్ఫరెన్స్ చేశారు. నందికొట్కూరు, మిడుతూరు మండలాలకు చెందిన వాలంటీర్లు జూపాడుబంగ్లా తహశీల్దార్ కార్యాలయం నుంచి తమ అభిప్రాయాలు చెప్పారు. రెండు మండలాలకు చెందిన వారు ఒకేసారి రావటం వల్ల.. స్థలాభావంతో నేలపై కూర్చోవాల్సి వచ్చింది. కాన్ఫరెన్స్ కు టీవీ లేని పరిస్థితుల్లో ల్యాప్టాప్ ద్వారా నిర్వహిచారు. సదుపాయాల కొరతతో వాలంటీర్లు, తహశీల్దార్, ఎంపీడీవోలు, కమిషనర్ ఇబ్బంది పడాల్సి వచ్చింది.
సౌకర్యాల లేమితో.. అధికారులు సతమతం - lack of facilities
కర్నూలు జిల్లా కలెక్టర్... అధికారులు, గ్రామ వాలంటీర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. సరైన సదుపాయాలు లేక ఎదుర్కొంటున్న సమస్యలను... నందికొట్కూరు, మిడుతూరు మండలాలకు చెందిన సిబ్బంది.. కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
సౌకర్యాల లేమితో సతమతమవుతున్న అధికారులు