srishailam project: శ్రీశైలం జలాశయం 2గేట్లు ఎత్తిన అధికారులు - శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తిన అధికారులు
22:20 October 10
srisailam breaking
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు 2 గేట్లను ఎత్తారు. 56 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1,82,876 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.30 అడుగులు ఉండగా.. 211.4759 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేసి అదనంగా 64,773 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Maa elections 2021: 'మా' అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ఆధిక్యం
TAGGED:
srisailam breaking