కర్నూలు జిల్లా నంద్యాలలో కిరాణా దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు సరకులు విక్రయిస్తున్న వారిపై జరిమానా విధించారు. లాక్డౌన్ క్రమంలో కొన్ని కిరాణా దుకాణాలకు అధికారులు అనుమతి ఇచ్చారు.
కిరాణా షాపుల్లో తనిఖీలు..పలు షాపులకు జరిమానా - Officers of the Department of Measurements
కర్నూలు జిల్లా నంద్యాలలో కిరాణా షాపులపై అధికారులు దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ ధరల కన్నా అధిక ధరలకు సరకులు విక్రయిస్తున్న వారిపై జరిమానా విధించారు.
కిరాణా షాపుల్లో తనిఖీలు, జరిమానా
అలా అనుమతి పొందిన దుకాణాల్లో ఎమ్మార్ సూపర్ మార్కెట్, విజయలక్ష్మి జనరల్ స్టోర్స్‌లో అధికారులు తనిఖీలు చేశారు. మినపప్పు కిలో వంద రూపాయలు ఉండగా నూటా ఇరవై రూపాయలకు అమ్ముతున్నందున ఎమ్మార్ సూపర్ మార్కెట్‌కు రూ.8 వేలు, విజయలక్ష్మి జనరల్ స్టోర్స్‌కు రూ.3 వేలు జరిమానా విధించారు. అన్నపూర్ణ ట్రేడర్స్‌లో పెసరపప్పు అధిక ధరలకు విక్రయించడం తో రూ.5 వేలు జరిమానా విధించారు.