కర్నూలు సమీపంలోని మునగాలపాడు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మునగాలపాడులో రాములమ్మ అనే మహిళ ఇంటి ముందు మంగళవారం ఉదయం గుర్తుతెలియని దుండగులు... పసుపు, కుంకుమ చల్లి పుర్రె, ఎముకలు, నిమ్మకాయలు, చీపురుకట్ట పెట్టారు. ఆమె వాటిని చూసి భయానికి గురైంది. స్థానికులు కంగారుపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎవరైనా కక్షగట్టి ఇలా చేశారా.. ఇతర కారణాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.
మునగాలపాడులో ఓ ఇంటిముందు క్షుద్రపూజలు..! - మునగాలపాడులో పుర్రెతో పూజలు
ఇంటి ముందు పుర్రెలు, చీపురు, కుంకుమ కనిపించేసరికి ఆ ఇంటి యజమాని కంగారుపడింది. ఆమెపై క్షద్రపూజలు చేశారేమోనని భయపడింది. కర్నూలు సమీపంలోని మునగాలపాడులో ఈ ఘటన జరగగా... పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మునగాలపాడులో ఓ ఇంటిముందు క్షుద్రపూజలు