ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి' - కర్నూలులో ఓసీ జేఏసీ నేతలు నిరాహార దీక్ష వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ఓసీ జేఏసీ కర్నూలులో నిరాహార దీక్ష చేపట్టింది. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, బలిజ కులస్థులు ఓసీ జేఏసీగా ఏర్పడ్డారు. కొన్ని రోజులుగా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

OC JAC agitation
రిజర్వేషన్లు అమలు చేయాలి

By

Published : Jan 11, 2021, 4:11 PM IST

పేద అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్​ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ కర్నూలులో ఓసీ జేఏసీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, బలిజ కులస్థులు ఓసీ జేఏసీగా ఏర్పడి కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అగ్రవర్ణాల్లో చాలా మంది పేదలు ఉన్నారని వారికి రిజర్వేషన్లు లేనందునా విద్యా‌‌, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ వేంటనే రాష్ట్రంలోని అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details