పౌష్టికాహార మహోత్సవం పురస్కరించుకుని కర్నూలులో2కే రన్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ప్రారంభించారు.పోషకాహారం ఇంటింటి వ్యవహారం అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం నుంచి కోట్ల కూడలి వరకు మహిళ,శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు.పౌష్టికాహరంతోనే ఆరోగ్యం,చురుకైన తత్వం అబ్బుతుందని అదనపు జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దిన్ అన్నారు.అనంతరం2కే రన్ లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందించారు.
'కర్నూల్లో పౌష్టికాహార మహోత్సవం' - కర్నూలు జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి
పౌష్టికాహార మహోత్సవం సందర్భంగా కర్నూలులో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషకాహారం ఇంటింటి వ్యవహారం అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం నుంచి కోట్ల కూడలి వరకు మహిళ, శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు.
'కర్నూల్లో పౌష్టికాహార మహోత్సవం'