ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్టీఆర్ స్మృతిగా.. సుద్ధ ముక్కపై ప్రతిరూపం - ntr birthday news

మైక్రో ఆర్ట్స్​లో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కర్నూలు జిల్లా ఆదోని యువకుడు అశోక్​ శ్రీనాథ్​.. ఎన్టీఆర్ సందర్భంగా ఆయన ప్రతిమను పెన్సిల్ మొనపై చెక్కారు. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని, ఆయన సంక్షేమ పాలన గుర్తుచేసుకునేందుకు ఈ ఆర్ట్స్ చేశానని శ్రీనాథ్ తెలిపారు.

ఎన్టీఆర్ స్మృతిగా.. సుద్ధ ముక్కపై ప్రతిరూపం
ఎన్టీఆర్ స్మృతిగా.. సుద్ధ ముక్కపై ప్రతిరూపం

By

Published : May 29, 2020, 7:10 AM IST


కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అశోక్ శ్రీనాథ్ అనే యువకుడు మైక్రో ఆర్ట్స్​లో రాణిస్తున్నారు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఈ కుర్రాడు.. చదువుతో పాటు కళారంగంలోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. వివిధ కళారూపాలను పెన్సిల్, చాక్ పీస్ మొనపై చెక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

అశోక్​ శ్రీనాథ్​, కళాకారుడు

పెన్సిల్ మైక్రో ఆర్ట్స్‌లో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్... పెన్సిల్‌ ముల్లుపై 5.3 ఎంఎం కొలతలతో వినాయకుడి విగ్రహం చెక్కి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. మహానేత ఎన్ఠీఆర్ జయంతి సందర్బంగా, ఆయనపై అభిమానంతో సుద్ధముక్కపై.. ఎన్టీఆర్ ప్రతిరూపం చెక్కారు.

తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, ఆ జననేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని శ్రీనాథ్ గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి :మహానాడులో తెలంగానం: రైతుల కష్టాలపై తీర్మానం

ABOUT THE AUTHOR

...view details