కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ తెదేపా నేత టీజీ భరత్ అన్నారు. మౌర్య ఇన్‌లో 18, 22, 23, 24, 25 వార్డులకు సంబంధించి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు.
కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల సందడి - kurnool district newsupdates
కర్నూలు నరగపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెదేపా నేత టీజీ భరత్ అన్నారు. వార్డుల్లో కష్టపడి పనిచేసే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశామని.. వారి గెలుపునకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
కార్పోరేటర్‌గా పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల సందడి
అధికార పార్టీకి ఓటు వేస్తే.. అభివృద్ధి కుంటుపడుతుందన.. టీజీ భరత్ అన్నారు. అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపాకు చెందిన అభ్యర్థులు విజయం సాధించాలన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. వార్డుల్లో కష్టపడి పనిచేసే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశామని.. వారి గెలుపునకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండి:2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి: డీడీఆర్‌పీ ఛైర్మన్