కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు యత్నించిన లక్ష్మీదేవి అనే మహిళపై తాము ఎలాంటి దౌర్జన్యం చేయలేదని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. లక్ష్మీదేవి భూమిని తాను ఆక్రమించినట్లు వారు చెప్పడం అవాస్తవమని కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ వద్ద తనకు చెడ్డపేరు తేవాలని కొందరు చేస్తున్న పన్నాగం అని ఆరోపించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మీదేవి బంధువులకు చెందిన భూమిని కొనుగోలు చేశానే తప్ప.. పక్కన ఉన్న లక్ష్మీదేవి స్థలం జోలికి పోలేదన్నారు. ఆ భూమిని అమ్ముకునే హక్కు ఆమెకు ఉందన్నారు. బెదిరిస్తే భయపడనని... తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పష్టం చేశారు.
ఆ మహిళపై ఎలాంటి దౌర్జన్యం చేయలేదు: కాటసాని రామిరెడ్డి - Laxmi devi suicide latest news
నంద్యాలలో ఆత్మహత్యకు యత్నించిన లక్ష్మీదేవి అనే మహిళపై తాము ఎలాంటి దౌర్జన్యం చేయలేదని... బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వద్ద తనకు చెడ్డపేరు తేవాలని కొందరు చేస్తున్న పన్నాగం అని ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆ మహిళపై ఎలాంటి దౌర్జన్యం చేయలేదు: కాటసాని