ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 8, 2022, 5:03 PM IST

ETV Bharat / state

వర్షాలకు తెగిపోయిన కల్వర్టు.. మురుగు కాలువ దాటాలంటే సాహసమే

NO BRIDGE: రాష్ట్రంలో రోడ్లపై వెళ్లాలంటేనే భయమేస్తోంది. మరోవైపు వర్షాలు, వరదలకు వంతెనలు కొట్టుకుపోతున్నాయి. వాగులు దాటేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఎమ్మిగనూరులో భారీ వర్షాలకు మురుగు నీటిపై కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో పిల్లలు, వృద్ధులు మురుగు కాలువ దాటాలంటే పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది.

drainage
మురుగు నీటి కాలువ

NO BRIDGE: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని సున్నం బట్టీ వీధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. మురుగు నీటి కాలువ కల్వర్టు కొట్టుకుపోయింది. దాంతో అవతలి వైపునకు వెళ్లేందుకు తాత్కాలికంగా గొట్టాలు వేశారు.. వాటిని దాటుకుంటూనే కాలనీవాసులు, విద్యార్థులు అవతలివైపుకు వెళ్తున్నారు. దానికి అవతల పాఠశాల ఉండటంతో పిల్లలు ఆ గొట్టాలను దాటుకుని వెళ్తున్నారు. వాటిని దాటే క్రమంలో అవి ఎత్తుగా ఉండటం వల్ల.. కొందరు కింద పడిపోతున్నారని.. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తెగిపోయిన కల్వర్టును త్వరగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని సున్నం బట్టీ వీధిలో మురికి నీటి కాలువపై వంతెన లేక ప్రజల ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details