అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడపలో చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన మృతురాలు హారతి... హైదరాబాద్లో బీటెట్ చదివే సమయంలో కడపకు చెందిన శంకర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వారు నెల క్రితం విహహం చేసుకున్నారు. కడపలో కాపురం పెట్టారు. పెళ్లయినప్పటి నుంచి అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తుండేవారు. అది తట్టుకోలేని హారతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలంలో సూసైడ్ నోటు దొరకటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అత్తింటి వారి వేధింపులకు ఆరిన 'హారతి'! - అత్తింటి వారి వేధింపులకు ఆరిన 'హారతి'
ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. ఆమె ఆశలను అడియాశలు చేస్తూ... మెుదటిరోజు నుంచి వేధింపులు మెుదలు పెట్టారు. ఇది భరించలేని ఆ నవవధువు బలవన్మరణానికి పాల్పడింది.
అత్తింటి వారి వేధింపులకు ఆరిన 'హారతి'