కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లికి చెందిన నవ వధువు అనురాధ (21) ఆత్మహత్య చేసుకుంది. ఇరవై రోజుల క్రితం ఎమ్మిగనూరుకు చెందిన కిరణ్ కుమార్తో ఆమెకు వివాహమైంది. ఇటీవల పుట్టింటికి వచ్చిన అనురాధ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ఈ అఘాయిత్యం చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్ వెల్లడించారు.