కరోనా నిర్ధరణ పరీక్షలు కర్నూలు జిల్లాలో ఎక్కువగా చేస్తున్నామని... కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోని కొవిడ్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 2 వీఆర్డీఎల్ ల్యాబ్‌లు ఉండగా.. అదనంగా మరో ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లాలో రోజూ 1500 వరకు పరీక్షలు నిర్వహిస్తుండగా.. కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌తో 2,500 దాకా పరీక్షలు చేసే అవకాశముందని తెలిపారు.
కర్నూలు కొవిడ్ ఆసుపత్రిలో నూతన వీఆర్డీఎల్ ల్యాబ్ ప్రారంభం - కర్నూలు కొవిడ్ ఆసుపత్రిలో కొత్త ల్యాబ్ ప్రారంభంకర్నూలు కొవిడ్ ఆసుపత్రిలో కొత్త ల్యాబ్ ప్రారంభం వార్తలు
కర్నూలు కొవిడ్ ఆసుపత్రిలో నూతన వీఆర్డీఎల్ ల్యాబ్‌ను.. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. దీని ద్వారా అదనంగా రోజుకు వెయ్యి పరీక్షలు చేయొచ్చని తెలిపారు.
కర్నూలు కొవిడ్ ఆసుపత్రిలో నూతన వీఆర్డీఎల్ ల్యాబ్