ఏవైనా అప్డేట్ చేసుకోవాలని మీ చరవాణికి సందేశం వస్తే అలాంటి లింకులను ఓపెన్ చేయొద్దని కర్నూలు పోలీసులు హెచ్చరిస్తున్నారు. తొందరపాటుతో అలాంటి సందేశాలతో పంపిన లింకులను ఓపెన్ చేస్తే క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్కులు.. లింకు ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో మోసాలు కూడా అన్నే విధాలుగా పెరుగుతున్నాయి. కర్నూలులో కేవైసీ అప్డేట్ చేసుకోండి అంటూ వచ్చిన లింకులు ఓపెన్ చేసిన ఓ వ్యక్తి ఖాతా నుంచి లక్షన్నరకు పైగా కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
సైబర్ నేరాలపై పోలీసులు
కర్నూలు జిల్లా నంద్యాల ములసాగరానికి చెందిన సిద్దయ్య అనే వ్యక్తి చరవాణికి కేవైసీ కాలం చెల్లింది అప్డేట్ చేసుకోవాలని సందేశం వచ్చింది. అప్డేట్ చేసేందుకు లింక్ ఓపెన్ చేయడంతో ఖాతాలో ఉన్న రూ.లక్షా 60 వేల 840 రూపాయలు విత్డ్రా అయ్యాయి. ఖాతాలో మొత్తం రూ.6 లక్షలు ఉండటం వల్ల అవి కూడా మాయమవుతాయని భావించిన సిద్దయ్య మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...