కర్నూలు జిల్లా ఆదోనిలో టీకా కేంద్రాలు బోసిపోతున్నాయి. పట్టణంలోని నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాలలోని వ్యాక్సిన్ కేంద్రంలో జనం లేక వెలవెలబోయింది. ఈ కేంద్రంలో 230 మందికి టీకా వేసేందుకు నిర్ణయించారు.
ముగ్గురు వైద్య సిబ్బందితో పాటు.. భద్రత కోసం ఒక కానిస్టేబుల్ను కేటాయించారు. కానీ మొదటిసారి టీకా తీసుకుని 84 రోజులు పూర్తయితే తప్ప.. రెండో డోసు వేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఒక్కరికి టీకా వేసే పరిస్థితి కనిపించలేదు.