ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కెట్ యార్డు కమిటీకీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం - mla katasani ramireddy taja news

కర్నూలు జిల్లా బనగానపల్లె మార్కెట్ యార్డు కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి... రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్లు కల్పించి పెద్దపీఠ వేసిందని తెలిపారు.

new committee for kurnool dst banaganapalli market yard
new committee for kurnool dst banaganapalli market yard

By

Published : May 24, 2020, 10:09 AM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మార్కెట్ యార్డ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్ని విధాలా న్యాయం చేశారని ఎమ్మెల్యే అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంతో ఎంతోమంది పేద రైతులకు పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా ఉందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్​గా ఎస్సీ మహిళ దీవెనమ్మను ఎంపిక చేశామని తెలిపారు. ఉప చైర్మన్​గా స్పందన జనార్దన్​రెడ్డి, కమిటీ సభ్యులుగా మరో 18 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ABOUT THE AUTHOR

...view details