జులై 31న కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో టెక్కే వద్ద రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం పలువురిని కలచివేసింది. పట్టణంలోని హోసింగ్ బోర్డు కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలుడు శ్రీ హర్ష తన స్నేహితుడు శిల్పానగర్ కు చెందిన రాజు గౌడ్ తో ద్విచక్రవాహనంపై వెళుతూ లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో లభ్యమయ్యాయి.
పట్టణంలో తాగునీరు సరఫరా చేసే పైపులైన్ లీకవ్వటంతో 3 నెలల క్రితం రోడ్డును తవ్విన పురపాలక శాఖ సిబ్బంది సమస్యను పరిష్కరించారు. తవ్విన ప్రదేశంలో గుంత పడడంతో కంకర వేసి వదిలేశారు. అదే ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదంలో బాలుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత స్పందించిన అధికారులు గుంతను సిమెంటుతో పూడ్చివేశారు.