కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే జాతర ఇది. బంధుమిత్రులకు విందులు ఏర్పాటు చేయాలన్నా, పాడి పశువులు కొనాలన్నా, జోడెడ్లు బేరం చేయాలన్నా, వ్యవసాయ పనిముట్లు చేయించుకోవాలన్నా...ఇదే శుభ సమయమని భావిస్తారు. కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
ఎమ్మిగనూరులో నీలకంఠుడికి నెలరోజుల జాతర! - ఎమ్మిగనూరులో నీలకంఠుడికి... నెలరోజుల జాతర
ఏ జాతర అయినా ఒకరోజో రెండురోజులో జరుగుతుంది. మహా అయితే పదిహేను రోజులు నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం మాత్రం నెలరోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.

ఎమ్మిగనూరులో నీలకంఠుడికి... నెలరోజుల జాతర!
Last Updated : Jan 16, 2020, 7:20 PM IST