ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ బాధిత చిన్నారులకు కౌన్సిలింగ్' - సంవేదన పేరుతో చిన్నారులకు కౌన్సిలింగ్

కొవిడ్ బారినపడ్డ చిన్నారులకు టెలిఫోన్ ద్వారా 'సంవేదన' పేరుతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ​రైట్స్ సభ్యులు ఆర్.జి.ఆనంద్ అన్నారు. కర్నూలు జిల్లాలో చిన్నారుల సంరక్షణపై అధికారులతో సమీక్షించారు.

ncpcr member rg anand
కొవిడ్ బారినపడ్డ చిన్నారులకు సంవేదన పేరుతో కౌన్సిలింగ్

By

Published : Mar 23, 2021, 10:17 PM IST

పిల్లల సంరక్షణ, ఆపరేషన్ ముస్కాన్​ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో కర్నూలు జిల్లా ముందంజలో ఉందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు ఆర్.జి.ఆనంద్ కొనియాడారు. చిన్నారుల సంరక్షణ, పోషణపై కర్నూలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కొవిడ్ బారిన పడిన చిన్నారులకు టెలిఫోన్ ద్వారా సంవేదన పేరుతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. అందుకుగానూ అన్ని భాషల్లో టోల్ ఫ్రీ నంబరు 18001212830ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details