కర్నూలులోని మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీశైల పుత్ర దుర్గ అలంకారంలో శ్రీకామేశ్వరీ దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ప్రత్యేక పూజల నడుమ కన్నుల పండువగా నిర్వాహకులు వేడుకలు నిర్వహించారు.
శ్రీశైలపుత్ర దుర్గగా కనువిందు చేసిన కామేశ్వరీ దేవి - మహానంది కామేశ్వరీ దేవి ఆలయంలో నవరాత్రి
రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మహానందిలోనూ శ్రీ కామేశ్వరీ దేవిని అలంకరించారు. భక్తులకు కన్నుల పండువగా ఉత్సవం జరిగింది.
![శ్రీశైలపుత్ర దుర్గగా కనువిందు చేసిన కామేశ్వరీ దేవి mahanandi utsavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9215972-719-9215972-1602953923779.jpg)
మహానందిలో నవరాత్రి ఉత్సవాలు