కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో జరిగిన తెలుగుదేశం నాయకులు వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల హత్య కేసులో13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అన్నదమ్ములైన నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిలను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేయగా.....వారి అంత్యక్రియలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరుకానున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న లోకేశ్ పదిన్నర గంటలకు పెసరవాయి చేరుకుంటారు..
nara lokesh: హత్యకు గురైన తెదేపా నేతల కుటుంబాలను పరామర్శించనున్న నారాలోకేశ్ - kurnool district latest news
నేడు కర్నూలు జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) పర్యటించనున్నారు. హత్యకు గురైన తెదేపా నేతలు కుటుంబాలను పరామర్శించనున్నారు. వైకాపా నేతలే హత్యకు పాల్పడినట్లు లోకేశ్ ఆరోపించారు.
నారాలోకేశ్
Last Updated : Jun 18, 2021, 1:06 AM IST