కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో గురువారం దారుణహత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి మృతదేహాలకు నారా లోకేశ్ నివాళులులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్యకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. నాగేశ్వర్‌రెడ్డి బంధువులను ఓదార్చారు. అనంతరం నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి అంత్యక్రియల్లో నారా లోకేశ్ పాల్గొన్నారు.
Lokesh: ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు: లోకేశ్ - nara lokesh kurnool tour
కర్నూలు జిల్లాలో దారుణహత్యకు గురైన తెదేపా నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. గడివేముల మండలం పెసరవాయిలో బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
'ప్రజల తరఫున పోరాడుతున్న వారిపై దాడులు చేస్తారా. తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు జరుగుతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక 27 మంది తెదేపా నాయకులపై దాడులు చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు. నిన్న పెసరవాయిలో వాహనంతో ఢీకొట్టించి దారుణంగా హత్యచేశారు. కత్తితో బతికేవాడు... రాజకీయాలు చేసేవాడు... కత్తితోనే బలవుతాడు. తెదేపా కార్యకర్తలను బెదిరించి నాయకులను చంపితే పార్టీ పోతుందా... ప్రజల తరఫున ధైర్యంగా పోరాడుతాం.'- నారా లోకేశ్
ఇదీ చదవండి: