ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నకిలీ వాగ్దానాలు, అబద్ధాల వ్యాప్తి.. ఇదే వైకాపా పాలన' - నారా లోకేశ్ తాజా వార్తలు

నకిలీ వాగ్దానాలు, అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు మాత్రమే జగన్ ఉన్నారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కొవిడ్ మృతుల దహన సంస్కారాల కోసం ప్రభుత్వం వాగ్దానం చేసిన 15వేల రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు.

nara lokesh tweets on Covid-19 deaths Cremations
నారా లోకేశ్

By

Published : Aug 22, 2020, 3:47 AM IST

కొవిడ్ మృతుల దహన సంస్కారాల కోసం ప్రభుత్వం వాగ్దానం చేసిన 15వేల రూపాయల హామీ ఏమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. కర్నూలులో తన తండ్రిని కోల్పోయిన మెల్​బోర్న్​కు చెందిన ఓ ఎన్ఆర్ఐ అంత్యక్రియల కోసం అంబులెన్స్ సిబ్బందికి 85 వేల రూపాయలు చెల్లించానని వెల్లడించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. నకిలీ వాగ్దానాలు, అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు మాత్రమే జగన్ ఉన్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.

నారా లోకేశ్ చేసిన ట్వీట్

ABOUT THE AUTHOR

...view details