ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Yuvagalam : చంద్రబాబు హయాంలో దళితుల సంక్షేమానికి పెద్దపీట : నారా లోకేశ్ - SC representatives

Lokesh meet with Dalits: దళితుల అభివృద్ధికి తెలుగు దేశం పార్టీ విశేషంగా కృషి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జక్కసానికుంట్లలో ఎస్సీ ప్రతినిధులతో లోకేశ్ ముచ్చటించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 13, 2023, 10:37 PM IST

Updated : Apr 14, 2023, 6:13 AM IST

నారా లోకేశ్ యువగళం

Lokesh meet with Dalits : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం డి.రంగాపురం చేరుకోవడంతో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చారు.

ఎస్సీ ప్రతినిధులతో ముఖాముఖి.. దళితుల భూముల్ని అధికార వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని ఎస్సీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం.. ప్యాపిలి మండలం జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద గత ప్రభుత్వంలో స్వయం ఉపాధికి అనేక అవకాశాలు కల్పించారని.. దీని ద్వారా ఇన్నోవాలు, జేసీబీలు అందించారని తెలిపారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఆ పథకం అమలు కావడం లేదని వాపోయారు. జగన్ పాలన వచ్చిన తరువాత బిజినెస్ జరగక ఈఎంఐలు కట్టలేని దుస్థితి నెలకొందని ఎస్సీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

శ్మశాన వాటికలు లేవని.. ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంటూ రమణమ్మ అనే దళిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలకు శ్మశాన వాటికలు కూడా లేవని.. ఉన్న శ్మశానాల భూమిని కూడా వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో జరిగిన వర్గీకరణ వల్ల దళితుల్లో అన్ని ఉప కులాలకు న్యాయం జరిగిందని తెలిపారు. కానీ, సుప్రీం కోర్టు తీర్పు వల్ల మాకు నష్టం జరిగిందని తెలిపారు. దళితుల ఉన్నత విద్యకు ఉపయోగపడిన విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని... అంబేద్కర్ పేరు తొలగించారని ఎస్సీ ప్రతినిధులు తెలిపారు.

తెలుగు దేశం పాలనలో ఎస్సీలకు న్యాయం..2001లో రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబేనని లోకేశ్ గుర్తు చేశారు. దాని ద్వారా మాదిగ, ఉప కులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయని.. వేల మందికి మెడిసిన్, ఇంజినీరింగ్ సీట్లు వచ్చాయని అన్నారు. వైఎస్ వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయిందని చెప్పారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు, జగన్ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలు మీకు తెలుసు అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం టీడీపీ కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.

దళితుల కోసం పోరాటంలోనే జైలుకు వెళ్లా.. తాను జీవితంలో మొదటి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సందర్భం గుర్తు చేస్తూ.. ఒక దళిత యువతి కుటుంబానికి న్యాయం చెయ్యమని పోరాటం చేసినందుకేనని లోకేశ్ గుర్తు చేశారు. దళిత యువతి స్నేహలతను చంపేస్తే పోరాడింది టీడీపీ అని చెప్తూ.. రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికల కోసం భూములు లేవని ఎంతో మంది నా దృష్టికి తీసుకొచ్చారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల శ్మశానాల కోసం భూములు కేటాయిస్తామని వివరించారు.

70వ రోజు షెడ్యూల్... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం మహాపాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రలో 69వ రోజు లోకేశ్ 15.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకూ యువగళం మొత్తం 889.7 కిలోమీటర్లు పూర్తయ్యింది. పాదయాత్ర 70వ రోజు.. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం గుడిపాడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం గుడిపాడులో స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. హెచ్ఆర్ పల్లిలో యాదవులతో సమావేశం కానున్నారు. పూదొడ్డి, మందొడ్డి క్రాస్ వద్ద మామిడిరైతులతో భేటీకానున్న లోకేశ్.. ప్యాపిలి శివార్లలో భోజన విరామం తీసుకోనున్నారు. సాయంత్రం ప్యాపిలి నీలకంఠేశ్వరస్వామి గుడివద్ద స్థానికులతో లోకేశ్ సమావేశం కానున్నారు. పాదయాత్ర బీసీ కాలనీలో 900 కిలోమీటర్ మైలురాయి చేరుకోనుండగా.. శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. ప్యాపిలిలో నిర్వహించనున్న బహిరంగసభలో లోకేశ్ ప్రసంగించనున్నారు. పొలిమేరమెట్ట విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 14, 2023, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details