తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగరం గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందజేశారు. అనేక రోజులుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సదరు యువకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం, బయట సరైన ఉపాధి అవకాశాలు రాలేదని మనస్తాపంతో ఇటీవల నాగేంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నాగేంద్రప్రసాద్ తల్లి జయలక్ష్మమ్మ, ఇతర కుటుంబసభ్యులతో సమావేశమైన లోకేశ్ వారికి ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చే నిర్ణయాలు యువత తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కలిసి పోరాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తనకు కలిగిన పుత్రశోకం మరే తల్లికీ కలగకూడదంటూ ఆ తల్లి తన బాధను వ్యక్తం చేసింది.