ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nara Lokesh ప్రతి నియోజకవర్గంలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఐటి కంపెనీల ఏర్పాటు:లోకేశ్ - కర్నూలు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర

MGNREGA Workers: యువగళం పాదయాత్రలో 76వ రోజు నారా లోకేశ్ ఉపాధి హామీ కార్మికులతో ముచ్చటించారు. కూలీలతో కలిసి మట్టిని తవ్వుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే రూ.150 కూలీ ఇస్తున్నారని కూలీలు వాపోయారు. ప్రతి నియోజకవర్గంలో ప్లగ్ అండ్ ప్లే విధానం లో ఐటి కంపెనీలు ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగాల కల్పన చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 20, 2023, 10:27 PM IST

Nara Lokesh: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న నారా లోకేశ్ నేడు ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ సందర్భగా టీడీపీ కార్యకర్తలు లోకేశ్​కు ఘన స్వాగతం పలికారు. ఆదోని టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పెండేకల్, ఆరేకల్ వద్ద స్వాగతం పలికారు. లోకేశ్​ను గజ మాలతో ఆహ్వానించారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ పలుగుపట్టి మట్టితవ్వారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని పెద పెండేకల్ శివారు ఎర్రచెరువువంకలో ఉపాధి హామీ కూలీలను లోకేశ్ కలిశారు. కూలీలతో కలిసి మట్టిని తవ్వుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే రూ.150 కూలీ ఇస్తున్నారని వాపోయారు.

ఎండపొద్దున నీడకోసం కనీసం పరదా పట్టలు, మంచినీళ్లు కూడా ఏర్పాటుచేయడం లేదని తెలిపారు. పెరిగిన ధరల కారణంగా ఇప్పుడిస్తున్న కూలీ ఏ మూలకూ సరిపోవడం లేదని వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పనిదినాలు, కూలీ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.


స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు కోసం జగన్ ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదని... ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏ మాత్రం లేవని... పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దు చేశారని... ఆదోని విద్యార్థులు, యువత నారా లోకేశ్ కు తెలిపారు. కర్నూలు జిల్లా... ఆదోని మండలం నగలాపురంలో యువత, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా జగన్ మార్చేశారని లోకేశ్ ఆరోపించారు. కేజీ నుండి పీజీ వరకూ ఉన్న సజ్బెక్ట్ ప్రక్షాళన చేస్తామని, చదువు పూర్తయిన వెంటనే జాబ్స్ వచ్చేలా విద్యార్థులను సిద్దం చేస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ప్లగ్ అండ్ ప్లే విధానం లో ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తాం.

రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నారా లోకేశ్ సెల్ఫీ విడుదల చేశారు. ఆదోని నియోజకవర్గం ఆరేకల్లులో ప్రభుత్వ మైనార్టీ ఉర్దూ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.7 కోట్లు నిధులు కేటాయించి, నిర్మాణపనులు కూడా ప్రారంభించామని... వైసిపి ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా ఈ నిర్మాణాలను అంగుళం కూడా ముందుకు సాగనీయకుండా ఆపేశారని... కొత్తగా పనులు చేపట్టడం ఎలాగూ చేతగాదు... గతంలో ప్రారంభించిన పనులైనా పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి! అంటూ విమర్శించారు.

ఉపాధి హామీ కూలీలతో లోకేశ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details